Site icon NTV Telugu

Misha Agarwal: ఫాలోవర్స్ తగ్గారని సూసైడ్ చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్

Misha

Misha

ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల తన 25వ బర్త్‌డేకి కొన్ని రోజుల ముందు సూసైడ్ చేసుకుని బాధాకరంగా ఈ లోకాన్ని వదిలేసింది. ఆమె అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ, మిషా కుటుంబం ఈ హార్ట్‌బ్రేకింగ్ న్యూస్‌ని కన్ఫర్మ్ చేసింది.

Read More:Nani : పహల్గాం’లో మా టీమ్ మెంబర్ ను కోల్పోయాం!

ఆ పోస్ట్‌లో వాళ్లు ఇలా రాశారు: “మిషా అగర్వాల్ మరణం గురించిన ఈ బాధాకరమైన వార్తని భారమైన గుండెతో షేర్ చేస్తున్నాం. ఆమె పని మీద, ఆమె మీద మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్‌కి మీ అందరికీ థ్యాంక్స్. ఈ భారీ లాస్‌ని మేం ఇంకా డీల్ చేసేందుకు ట్రై చేస్తున్నాం.” ఇప్పుడు తాజాగా, మిషా కుటుంబం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ పెట్టి, మిషా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఎలా చనిపోయింది అనే విషయాలను రివీల్ చేసింది. ఆ పోస్ట్ ప్రకారం, మిషా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గడం వల్ల చాలా డిస్టర్బ్ అయ్యిందట. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట.

Read More: Jailer 2: రజనీ కోసం ‘బాలయ్య’ నడిచొస్తే ఉంటది “నా సామిరంగా”!

ఆమె ఫ్యామిలీ మెంబర్ ఒకరు మరిన్ని డీటెయిల్స్ షేర్ చేస్తూ, “మిషా తన ఇన్‌స్టాగ్రామ్, ఫాలోవర్స్ చుట్టూ తన ప్రపంచాన్ని బిల్డ్ చేసుకుంది. ఆమె గోల్ 1 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ చేయడం. కానీ ఫాలోవర్స్ తగ్గడం స్టార్ట్ అవ్వగానే ఆమె అప్‌సెట్ అయ్యింది. తనకి ఎలాంటి వాల్యూ లేదని ఫీల్ అయ్యింది. ఏప్రిల్ నుంచి ఆమె టోటల్ డిప్రెషన్‌లో ఉండేది. తరచూ నన్ను హగ్ చేసుకుని ఏడ్చేది. ‘నా ఇన్‌స్టా ఫాలోవర్స్ డ్రాప్ అవుతున్నాయి, నేను ఇక ఏం చేస్తాను? నా కెరీర్ ఫినిష్ అయిపోతుంది’ అని భయపడేది. నేను కంఫర్ట్ చేస్తూ, ధైర్యం చెప్పేవాణ్ణి. కానీ లాస్ట్‌లో ఆమె ఇలాంటి స్టెప్ తీసుకుంది” ఇన్‌స్టాగ్రామ్ అంటే జస్ట్ ఒక ఫన్ యాప్, అంతే! దాని గురించి ఇంత టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అని చెప్పారు.

Exit mobile version