ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18 నుండి ఆహాలో ప్రసారం అవుతోంది. విడుదలకు ముందే ట్రైలర్ తో భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. అయితే విడుదలయ్యాక దీనికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ ప్రియదర్శి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక హీరోయినేర్ నందిని రాయ్ కు ఓటిటి నుంచి ఆఫర్లు పెరిగాయి. ప్రేమ, కామం, స్వేచ్ఛ, దురాశ, అందం అనూహ్యమైన పనులు చేయడానికి ప్రజలను నడిపించేది ఏమిటి? రక్తం చిందించడానికి వారిని రెచ్చగొట్టేది ఏమిటి? అనే అంశాలతో ఈవెబ్ సిరీస్ తెరకెక్కింది. అడల్ట్ కంటెంట్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ర్యాప్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్ కు దీపక్ అలెగ్జాండర్ సంగీతం అందించారు. మీరు కూడా “ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్” ర్యాప్ సాంగ్ ను వీక్షించండి.