NTV Telugu Site icon

In Retreat : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వనపర్తి యువకుడికి ఆహ్వానం..

Whatsapp Image 2024 05 15 At 11.58.50 Am

Whatsapp Image 2024 05 15 At 11.58.50 Am

ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వనపర్తికి చెందిన యువకుడు రాఘవేందర్ కు ఆహ్వానం అందింది.రాఘవేందర్ ఎడిటింగ్ చేసిన “ఇన్ రీ ట్రీట్” అనే గంట 15 నిమిషాల నిడివి గల లడక్ ప్రాంతీయ భాషా చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది . ఈ సందర్భంగా రాఘవేందర్ ను ఫ్రాన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కు హాజరు కావాల్సిందిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది.

30 ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్ళిన ఓ వ్యక్తి తన సొంత ప్రాంతానికి తిరిగివచ్చి పొందిన మానసిక భావోద్వేగాల ఆధారంగా తెరకెక్కింది “ఇన్ రీ ట్రీట్”.పూణే లోని ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో పీజీ డిప్లొమా పూర్తిచేసిన రాఘవేందర్ మల్లేశం, హౌ ఇస్ దట్ ఫర్ మండే అనే రెండు చిత్రాలకు  ఎడిటింగ్ చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు.సినీ ప్రముఖల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న రాఘవేందర్ తాను ఎడిటింగ్ చేసిన మూడో సినిమా ఇన్ రీట్రీట్ ఏకంగా కెన్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక కావడం గొప్ప విషయం అని చెప్పొచ్చు.