గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దేవదాసు మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటు అలరించిన ఇలియానా.. కెరీర్ దూసుకుపోతున్న సమయంలో బాలీవుడ్ లో రాణించాలని భావించింది.అక్కడ ఇలియానా సినిమాలు అంతగా ఆకట్టుకోక పోవడంతో ఇలియానా కెరీర్ డౌన్ ఫాల్ అయింది. ఇలియానా టాలీవుడ్ ని వదిలి వెళ్లడంతో ఆమెని బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోలేదు.అలాగే ఇలియానా లవ్ ఎఫైర్స్ కూడా సంచలనం సృష్టించాయి. బ్రేకప్ ల వల్ల ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఇలియానా ఓ వ్యక్తిని ప్రేమించి ఓ బిడ్డకి తల్లి కూడా అయింది.ప్రస్తుతం కొడుకు మరియు భర్తతో ఇలియానా హ్యాపీగా వుంది.
ప్రస్తుతం ఇలియానా సినిమాల్లో ఆఫర్స్ కూడా అందుకుంటుంది. ఇలియానా నటించిన లేటెస్ట్ మూవీ ”దో ఔర్ దో ప్యార్” చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఇలియానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఈ చిత్రంలో ఇలియానా నోరా అనే పాత్రలో నటించింది. ఈ పాత్ర తన రియల్ లైఫ్ కి ఎంతో దగ్గరగా ఉంటుందని ఇలియానా తెలిపింది నోరా లాగే నేను కూడా ఎంతో సెన్సిటివ్ అని ఇలియానా పేర్కొంది..ఈ మూవీ డైరెక్టర్ శిరీష స్టోరీ చెప్పగానే వెంటనే ఒప్పేసుకున్నాను.ఈ చిత్రంలో నా పాత్ర కోసం శారీరకంగా ఫిట్ గా ఉండేందుకు జిమ్ వర్క్ ఔట్స్ చేయాలేమో అని భయపడ్డాను .ఎందుకంటే నేను మానసికంగా ఎంతో అలసిపోయాను .బరువు తగ్గడం నా వల్ల కాదు అని ఆమెతో చెప్పాను .ఆమె నన్ను అర్ధం చేసుకొని ఇప్పుడు మీరు బరువు తగ్గాల్సిన పని లేదు ఇప్పుడు మీరు ఎలా వున్నారో అలాగే కంటిన్యూ చేయమని ఆమె చెప్పినట్లు ఇలియానా తెలిపారు .
