Site icon NTV Telugu

Ileana : నా పిల్లల్ని దానికి దూరంగా పెంచుతాను..

Ileyana

Ileyana

ఇలియానా.. ఒక్కప్పుడు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. కిక్, పోకిరి, జులాయి.. వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతలో వేసుకున్ని.. నటన పరంగా అందం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ అంతే త్వరగా ఆఫర్ లు తగ్గడం తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, అక్కడ కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక పోతే ప్రజంట్ ఈ గోవా బ్యూటీ సినిమాల‌ను త‌గ్గించుకుని, పూర్తిగా వ్యక్తిగ‌త జీవితంపై దృష్టి సారించింది. త్వర‌లోనే రెండో బిడ్డకు జ‌న్మనివ్వబోతున్న ఇలియాన తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించింది..

Also Read : Salman Khan: సల్మాన్ బ్యాచిలర్‌గా ఉండిపోవడానికి కారణం అతనే.. !

ఒక అభిమాని పిల్లలు మంచిగా పెరడాలి అంటే త‌ల్లిగా ఏం చేయాలి? నిజ‌మైన ప్రేమ అంటే ఏమిటి? అని అడిగారు. ఈ ప్రశ్నకు స్పందించిన ఇలియానా.. ‘పిల్లల్ని ప్రేమ ‘సంపాదించుకోవాలి’ అనే విధంగా మాత్రం పెంచ‌ను. ఎందుకంటే నేను అనుభ‌వించిన అత్యంత చెత్త అనుభూతి అది. ప్రేమ స్వత‌హాగా ఉండాలి. అది సంపాదించుకుంటే వ‌చ్చేది కాదు. గౌర‌వం ఆనందంలా ప్రేమ కూడా స‌హ‌జంగా వ‌చ్చేది. నేను సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే దయగల పిల్లలుగా పెంచాలనుకుంటున్నాను. అంద‌రు తల్లిదండ్రులు అలానే భావిస్తారు. పిల్లలు ఎంతగా ప్రేమించ‌బ‌డుతున్నారో తెలుసుకోవడానికి నేను నా వంతు కృషి చేస్తాను. స‌హ‌జ‌సిద్ధమైన త‌ల్లి ప్రేమ‌, ఎమోష‌న్స్‌ని ఇష్టప‌డ‌తాను’ అని ఇలియానా చెప్పుకొచ్చింది.

Exit mobile version