Site icon NTV Telugu

Ilaiyaraaja : అసలైన ఆట ఇప్పుడే మొదలైంది..

Illiraja

Illiraja

సంగీత జ్ఞాని ఇళయరాజా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన సంగీతం అందించారు అంటే ఆ సినిమా 90 శాతం కన్ఫార్మ్ హిట్టు అయినట్లే. ఎందుకంటే ఆయన సంగీతం కోసం, ఆయన పాటల కోసం ప్రజలు థియేటర్లకు క్యూ కట్టేవారు. హీరో హీరోయిన్ లతో పాటుగా పోస్టర్ మీద ఇళయరాజా ఫోటో కూడా వేసేవారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఇళయరాజా మార్చి 8న లండన్ లో భారీ ‘సింఫోనీ’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక లండన్‌ల్లో ‘సింఫొని’ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి సోమవారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఇళయరాజాకు రాష్ట్ర ప్రభుత్వం, వివిధ పార్టీల తరపున ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..

Also Read: ‘Chhaava’ OTT : ‘ఛావా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ ?

‘కోరుకున్నట్లుగానే లండన్‌ల్లో నిర్వహించిన ‘సింఫోని’ కార్యక్రమం విజయవంతమైంది. ఇది సాధారణ విషయం కాదు. నా కార్యక్రమాన్ని ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయి అభిమానులు ఆస్వాదించారు, సంగీత నిపుణులు సైతం అభినందించారు. దీంతో పాటు మరో 13 దేశాలల్లో ‘సింఫోని’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒప్పందం జరిగింది. దుబాయ్, ప్యారిస్ తదితర చోట్ల నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. 82 ఏళ్లలో ఏం చేస్తానని అనుకోవద్దని, ఇక పైనే ఆట ఆరంభం అయ్యింది. నా ‘సింఫోని’ కార్యక్రమాన్ని డౌన్లోడ్ చేసుకుని వినడం కంటే.. నేరుగా ఆస్వాదిస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది’ అని పేర్కొన్నారు.

Exit mobile version