NTV Telugu Site icon

Icon Star : పుష్ప -2 కోసం నేషనల్ మీడియా హైదరాబాద్ రాక

Mythri

Mythri

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. దర్శకుడు సుకుమార్ పకడ్బందీగా  పర్ఫెక్ట్ గా వచెవరకు ఈ సినిమాను చెక్కుతున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన పుష్ప -2 టీజర్ తో హైప్ అలా పెంచేసారు మేకర్స్.  ఇప్పటికే పలు కారణాల వలన రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబరు 6న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా విదుడల అవుతోంది.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్, రవి భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Gangavva : గంగవ్వకు గుండెపోటు.. ఆ ఫోటో షేర్ చేసిన టీమ్ మెంబర్?

కాగా పుష్ప -2 కోసం చిత్ర నిర్మాతలు తొలిసారిగా ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలను మీడియా ముఖంగా వెల్లడించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలతో పాటు తెలుగు రాష్టాల డిస్ట్రిబ్యూటర్లు కూడా పాల్గొనబోతున్నారు. కానీ చిత్ర హీరోలైన అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనట్లేదు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈరోజు మీడియా సమావేశానికి తెలుగు మీడియా మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను కూడా హైదరాబాద్ రప్పిస్తున్నారు. అలాగే ఇతర బాషల డిస్ట్రిబ్యూటర్లు కూడా హాజరుకానున్నారు. పాన్ ఇండియా అంటే చెన్నై, ముంబై, బెంగుళూరు, కేరళ వెళ్లి ప్రమోషన్స్ నిర్వహించేవారు. కానీ తొలిసారిగా వారిని హైదరాబాద్ రప్పిస్తున్నారు మైత్రీ నిర్మాతలు. వారందరూ సమక్షంలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నడవనుంది

Show comments