iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!

Ibomma Is Back

Ibomma Is Back

చాలా కాలంగా కనుమరుగైపోయిందనుకున్న ఐబొమ్మ వెబ్‌సైట్ మళ్లీ ప్రత్యక్షం కావడం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన కేవలం గంటల్లోనే హై క్వాలిటీ ప్రింట్లు ఈ సైట్‌లో ప్రత్యక్షమవుతుండటంతో మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఈ వెబ్‌సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇమంది రవి అరెస్ట్ కావడంతో ఈ వెబ్ సైట్ కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ, ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే వెబ్‌సైట్ మళ్లీ యాక్టివ్ కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా, ఈ వెబ్‌సైట్‌ను మళ్లీ ఎవరు మొదలుపెట్టారు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అరెస్టైన రవి ప్రస్తుతం బయట ఉండటం వల్లే ఇది మళ్లీ ప్రారంభమైందా? లేక తెర వెనుక ఉండి ఎవరైనా దీని కార్యకలాపాలను నడిపిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ కోట్లలో నష్టపోతున్న తరుణంలో, ఐబొమ్మ రీ-ఎంట్రీ మేకర్స్‌ను కలవరపెడుతోంది. అధికారులు ఈ వెబ్ సైట్ మూలాలను వెతికే పనిలో పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇప్పటికే జనాలు థియోటర్ లకు రాకా.. యాజమన్యం తలపటుకుంటుంటే ఇప్పుడు సడన్ ఐబొమ్మ వెబ్‌సైట్ మళ్లీ ఎంట్రీ పెద్ద షాక్ ఇచ్చింది.