Site icon NTV Telugu

IBM: హీరోగా మారుతున్న మరో చైల్డ్ ఆర్టిస్ట్‌

Child Artist Hero

Child Artist Hero

సరికొత్త ప్రేమకథతో ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ తన తొలి చిత్రాన్ని రూపొందిస్తోంది. వరలక్ష్మీ పప్పు సమక్షంలో, కనకదుర్గారావు పప్పు నిర్మాతగా, భాను దర్శకత్వంలో ఈ చిత్రం యువతను ఆకర్షించేలా రూపుదిద్దుకుంటోంది. ‘సందేశం’ వంటి సామాజిక స్పృహతో కూడిన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు భాను, ఈసారి తన స్టైల్‌ను మార్చుకుని ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించారు. 49 రోజులపాటు నాన్-స్టాప్ షూటింగ్‌తో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 2025లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Read More: Meerut: భర్త “గడ్డం” తీయనందుకు, మరిదితో లేచిపోయిన మహిళ..

ఈ చిత్రంలో యువతను ఆకట్టుకునే ఐదు అద్భుతమైన పాటలు ఉన్నాయి. ఒక ప్రముఖ సంగీత కుటుంబం నుంచి వచ్చిన కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. అలాగే, ఒక టాలెంటెడ్ రైటర్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు, ఇది కథకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ చిత్రంలో హీరోగా 75 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఒక యువ నటుడు, హీరోయిన్‌గా సాంప్రదాయ తెలుగు అమ్మాయి నటిస్తున్నారు. వీరి జోడీ యువతను ఆకర్షించేలా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను యూనిట్ సభ్యులు త్వరలో అభిమానుల ముందుకు తీసుకురానున్నారు.

Exit mobile version