Site icon NTV Telugu

SamyuktaMenon: నేను మందేస్తా.. అయితే ఏంటి?.. స్టార్ హీరోయిన్ సంచలనం

Samyuktha Minon

Samyuktha Minon

టాలీవుడ్ లక్కీ చామ్ సంయుక్త గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ, మలయాళ చిత్రాలతో సౌత్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగు ఆడియన్స్ ను కూడా మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ తో తివిక్రమ్ పరిచయం చేసిన ఈ హీరోయిన్ తెలుగు ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంది.  దీం తర్వాత వరుస అవకాశాలు అందుకున్న సంయుక్త ‘బింబిసార’, ‘సార్’,‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్‌ లను తన ఖాతాలో వేసుకుంది. ప్రజంట్ ‘బింబిసార 2’, నిఖిల్ ‘స్వయంభు’ వంటి చిత్రాలతో పాటు, బాలక్రిష్ణ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సీక్వెల్ ‘అఖండ 2’ వంటి చిత్రాలో నటిస్తోంది. మొత్తానికి ఈ ఏడాది వరుస పెట్టి సినిమాలతో అలరించబోతోంది సంయుక్త. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకున్న ఓ బ్యాడ్ హ్యాబిట్ గురించి బయట పెట్టింది..

Also Read:kaithi: కార్తి ‘ఖైదీ 2’ లో కమల్ హాసన్

నాకు ఆల్కహాల్ సేవించే అల‌వాటుంది కానీ అదే ప‌నిగా తాగ‌ను, ఎప్పుడైనా స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువైన‌ప్పుడు మాత్రమే కొంచెం తీసుకుంటా’ అని మొహ‌మాటం లేకుండా చెప్పింది సంయుక్త. సాధారణంగా హీరోయిన్లకు ఇలాంటి అల‌వాట్లున్నా ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డానికి ఇష్టప‌డ‌రు. కానీ సంయుక్త మీనన్ మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.

Exit mobile version