NTV Telugu Site icon

Director Bobby : మోక్షజ్ఞ దొరికితే ఎందుకు వదులుతాను..?

Bobby (2)

Bobby (2)

గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఎట్టకేలకు ఈ ఏడాదిలో మోక్షు హీరోగా లాంచ్ అవనున్నాడనే గుడ్ న్యూస్ చెప్పి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. హనుమాన్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు బాలయ్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. ఇదే జోష్‌లో షూటింగ్‌కు రెడీ అయ్యారు.

Also Read : AlluArjun : పుష్ప – 2 దాటికి తట్టుకోలేకపోయిన ‘బేబీ జాన్’

కానీ ఏమైందో ఏమో గానీ ఈ సినిమా పూజా కార్యక్రమం మాత్రం బ్రేక్ పడింది.  దీంతో ఈ ప్రాజెక్టే ఆగిపోయిందా అనే సందేహాలు ఉన్నాయి. కానీ మోక్షు దొరికితే మాత్రం వదలని చెబుతున్నాడు మాస్ డైరెక్టర్ బాబీ. బాలకృష్ణ నటించిన లేటెస్ట్ ఫిల్మ్‌ ‘డాకు మహారాజ్’కు బాబీ దర్శకత్వం వహించిస సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రమోషన్స్‌లో భాగంగా మోక్షజ్ఞపై బాబీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్య్వూలో బాబీ మాట్లాడుతూ  మోక్షజ్ఞ ఓ నాలుగు సార్లు డాకు మహారాజ్‌కి సినిమా సెట్‌కి వచ్చాడు. అతన్ని చూస్తే ఆరడుగులు, చాలా షార్ప్ ఫ్యూచర్స్, చాలా ఒదిగి ఉంటాడు, చాలా నేర్చుకోవాలనే తపన ఉంటుందని అనిపిస్తుంది. ఒక డైరెక్టర్‌గా ఇలాంటి కుర్రాడు మనకి దొరికితే బాగుంటుందని అనిపిస్తుంది. అతనితో సినిమా తీయాలనే ఆశ ఉంటుంది, తీసే ఛాన్స్ వస్తే ఎవరూ వద్దనుకోరు. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. ఛాన్స్ అదే వస్తుంది అని అన్నారు. మరి ఫ్యూచర్లో అయినా మోక్షుతో బాబీ సినిమా చేస్తాడేమో చూడాలి.