Rashmika Mandanna: నా కోసం యుద్ధం చేసే జీవిత భాగస్వామి కావాలి.. కాబోయే భర్తపై రష్మిక కామెంట్స్ వైరల్!
- వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న..
- నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి..
- నన్ను అర్థం చేసుకుని, నిజాయితీగా ఉండే వ్యక్తి కోసం వెతుకుతున్నా: రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: వరుస చిత్రాలతో పాటు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం వార్తలతో గత కొన్ని రోజులుగా ప్రతి రోజు ట్రెండింగ్‌లో నిలిచింది రష్మిక మందన్న. అయితే, తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌లో చిట్‌చాట్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర ఆన్సర్స్ చెప్పింది. ఇక, తన భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటుందో చెప్పాలని ఒక ఫ్యాన్ కోరగా మందన్న నవ్వుతూ దానికి సమాధానం ఇచ్చింది. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు చెప్పింది. నిజాయితీగా చెప్పాలంటే నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి.. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచించి అర్థం చేసుకునే వ్యక్తి.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే వ్యక్తి కోసం చూస్తున్నా.. అలాగే, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి అని రష్మిక మందన్న వెల్లడించింది.
Read Also: Israel-Iran: మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి హత్యకు ఇరాన్ కుట్ర.. ఆరోపణలు ఖండించిన టెహ్రాన్
Also Read
ఇక, అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను.. ఆ యుద్ధంలో బుల్లెట్ కైనా ఎదురెళ్తానని నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేర్కొనింది. ఇక, అక్టోబర్ 3వ తేదీన రష్మిక, విజయ్‌ల నిశ్చితార్థం జరిగినట్లు న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ ఈ మధ్య పలు ఇంటర్వ్యూల్లో ఆమె పరోక్షంగానే స్పందించారు. అలాగే, నా ఎంగేజ్మెంట్ విషయంలో మీరు ఏం అనుకుంటున్నారోఅదే నిజం.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?