స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి పరిచయం అక్కర్లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీకి పరిచయమై.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది. తన తండ్రి పేరు ఎక్కడ కూడా వాడకుండా తన సొంత ట్యాలెంట్ తో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు నేషనల్ స్థాయిలో కాకుండా ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తుంది. ఇక తలైవా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కూలీ’. ఈ సినిమాలో శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి శ్రుతి హాసన్ తన అనుభూతిని పంచుతుంది..
Also Read: Salman Khan : చావు ని ఎవ్వరు ఆపలేరు..
‘రజనీకాంత్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. అంతపెద్ద స్టార్ గా ఎలా ఎదిగారో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు అర్థమైంది. క్రమశిక్షణ, అంకితభావం, పాత్ర కోసం కష్టపడే తత్వం ఇలా ఎన్నో విషయాల్లో ఆయన్ని చూసి నేర్చుకున్నాను. వినయంగా ఉంటారు. సెట్లో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా పని చేస్తారు. ఆయన సెట్ లో ఉంటే ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ఒక వ్యక్తిగా ఇతరులతో ఎలా వ్యవహరించాలో ఆయన నుంచి నేర్చుకున్న. సెట్‌లో పరిచయం ఉన్నవారితో మాత్రమే నేను మింగిల్ అయ్యేదాని. కానీ రజనీ సార్ అలా కాదు.. ప్రతి ఒక్కరిని పలకరిస్తారు. ప్రేమగా ఉంటారు. ‘కూలీ’లో నా పాత్ర చాలా సింపుల్‌గా ఉన్న అందరికీ కనెక్ట్ అవుతుంది. లోకేష్ దర్శకత్వంలో వర్క్ చేయడం నా కల. మొత్తానికి నెరవేరింది’ అంటూ చెప్పుకోచ్చింది శృతి.