Site icon NTV Telugu

SS Rajamouli : నాకు దేవుడి మీద నమ్మకం లేదు.. రాజమౌళిపై విమర్శలు

Ss Rajamouli

Ss Rajamouli

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ రిలీజ్ GlobeTrotter ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. SSMB29 టైటిల్ ను వారణాసి గా ప్రకటిస్తూ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో రిలీజ్ చేసాడు రాజమౌళి. వరల్డ్ ఆఫ్ వారణాసి గ్లిమ్స్ కు అద్భుతామైన స్పందన వస్తుంది. అ

Also Read : SSMB 29 : ‘వారణాసి’ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ పట్ల మహేశ్ ఫ్యాన్స్ హ్యాపియేనా.?

అయితే ఓ చిన్న సాంకేతిక లోపం కారణంగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. అయితే దీనికి ముందు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. తనకు ఆంజనేయస్వామి ఇష్టదైవం అని అందుకే రాజమౌళితో వారణాసి సినిమాను హనుమే వెనుకుండి చేయించుకున్నారని చెప్పారు. కానీ సాంకేతిక లోపం కారణంగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఆగడంతో రాజమౌళి కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ విషయమై ఆయన స్పందిస్తూ ‘ నాకు దేవుడి మీద నమ్మకం లేదండి, నా తండ్రి విజయేంద్రప్రసాద్ నాతో మాట్లాడూతూ టెన్షన్ పడకు అంత హనుమ చూసుకుంటాడు, వెనకుండి నడిపిస్తాడు అన్నారు. కానీ సాంకేతిక లోపం కారణంగా ఆగినప్పుడు ఇలానే నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్య రమా హనుమాన్ అంటే చాలా చాలా ఇష్టం. ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇలా ఎందుకు అయిందని కోపం వచ్చింది’ అని అన్నారు. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజమౌళిపై విమర్శలు చేస్తున్నారు కొందరు.

Exit mobile version