వరలక్ష్మి శరత్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీ లో ఎదిగిన తన తండ్రికి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఎప్పుడు అవకాశాల కోసం తన తండ్రి పేరు ఉపయోగించుకోలేదు. ఇలాంటి వారసులు ఇండస్ట్రీలో అరుదుగా ఉంటారు. తన సొంత టాలెంట్ తో వరలక్ష్మి శరత్ కుమార్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో వరలక్ష్మీకి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు. తెలుగులోనూ తమిళంలోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. అయితే తాజాగా ఒక డాన్స్ షో లో పాల్గొన్న వరలక్ష్మి తనకు సంబంధించిన రహస్యాన్ని పంచుకుంది.
Also Read: Rajinikanth : ‘జైలర్ 2’ నుంచి సాలిడ్ అప్డేట్!
వరలక్ష్మి రీసెంట్ గా ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు పిల్లలకు తల్లి అయినటువంటి ఒక మహిళా ఎవ్వరూ ఊహించని రీతిలో అద్భుతమైన డ్యాన్స్ చేసి తన సత్తా చాటింది. అనంతరం ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆమెకు సర్ది చెప్పే క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు, ఎవరికీ తెలియని రహస్యలు పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘మీతో నేను ఒక విషయం పంచుకోవాలని అనుకుంటున్నాను. సినిమాల్లోకి రాకముందు నేను మొట్టమొదటిసారి ఒక ప్రముఖ షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. అందుకు నాకు వారు రూ.2500 ఇచ్చారు. అలాంటి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఎన్నడూ కూడా రోడ్డు మీద డ్యాన్స్ చేయడం తప్పుగా భావించవద్దు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది
