NTV Telugu Site icon

Nabha Natesh: మొక్కుబడిగా చేసిన ఆ పనిని ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నా : నభా నటేష్

February 7 2025 02 19t082622.569

February 7 2025 02 19t082622.569

బిగినింగ్ లోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా వెండితెరపై మాయ చేసింది. అనంతరం రామ్ పోతినేని సరసన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో నభా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. మాస్ డైలాగ్‌లతో తెలంగాన యాసలో ఇరగధీసింది. అనంతరం డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో.. వంటి వరుస సినిమాల్లో అలరించింది ఈ చిన్నది. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

Also Read:kulli: రజినీకాంత్ మూవీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన స్టార్ హీరోయిన్..

ప్రజెంట్ ఇప్పుడు తిరిగి కోలుకుని ‘డార్లింగ్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం నిఖిల్‌తో ‘స్వయంభు’ సినిమా చేస్తుంది. ఇక మూవీ తప్ప నభా చేతిలో కొత్త సినిమా లేవీ లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది నభా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో దర్శనమిస్తూ.. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నభా తన యాక్సిడెంట్ గురించి తన ఫిట్ నెస్ గురించి మాట్లాడింది.. ‘యాక్సిడెంట్ జరిగిన త‌ర్వాత వ‌ర్కవుట్స్ చేయ‌డాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాన‌ు. శ‌రీరంపై మరింత అవగాహన పెరిగింది. మొబిలిటీ ఎక్సర్సైజ్‌లు, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ ఎక్కువగా చేస్తున్నా.. యాక్సిడెంట్‌కు ముందు హీరోయిన్ ని కాబట్టి ఎదో మొక్కుబడిగా వ‌ర్కవుట్స్ చేసేదాన్ని.. కానీ ఇప్పుడు నా ఆలోచన విధానం మొత్తం మారిపోయింది’ అని చెప్పుకొచ్చింది నభా నటేష్.