NTV Telugu Site icon

Pushpa 2 : సుకుమార్‌ కు ఎప్పటికి రుణపడి ఉంటా : అల్లు అర్జున్‌

Allu

Allu

పుష్ప-2 ది రూల్‌ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. తాజాగా ముంబయ్‌లో ‘పుష్ప-2’ హీరో, హీరోయిన్‌ నిర్మాతలు సందడి చేశారు. అక్కడ గ్రాండ్‌ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ” ఈ సినిమా విషయంలో నేను థాంక్స్‌ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు.. వాళ్లు లేకుంటే, వాళ్ల సపోర్ట్‌ లేకుండా ఈ సినిమా సాధ్యపడేది కాదు. నా చిన్ననాటి స్నేహితుడు దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్క్షతలు. త్వరలో రాబోతున్న పాటతో దేవి మ్యాజిక్‌ మరో సారి తెలుస్తుంది. ఫహాద్‌ ఫాజిల్‌తో పనిచేయడం ఎంతో గ్రేట్‌గా వుంది.  గత నాలుగు సంవత్సరాలుగా రష్మికతో కలిసి పనిచేశాను.  ఈ ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు కావాలి అనిపించేంతగా రష్మిక గొప్పతనం కనిపిస్తుంది.

Also Read : Kichcha Sudeep : క్రిస్మస్ రేస్ లో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

నా జర్నీలో దర్శకుడు సుకుమార్‌తో 20 ఏళ్ల ప్రయాణం మొదలైంది. పుష్ప ఈ రోజు నేను హీరోగా ఇలా వున్నానంటే ఆయనే కారణం నన్ను స్టార్‌ను చేసింది సుకమారే. నా లైఫ్‌లో అత్యధిక భాగం. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది. ఈ రోజు ఆయన రాలేదు కానీ ఈ రోజు కూడా చిన్న చిన్న మార్పుల కోసం సినిమాపై ఇంకా పనిచేస్తున్నాడు. ప్రేక్షకులకు ఓ బెస్ట్‌ సినిమా ఇవ్వాలి. వాళ్లకు గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ సినిమా ఇవ్వాలని వర్క్‌ చేశాం. ఐదు సంవత్సరాలు మా లైఫ్‌లో బెస్ట్‌ ప్రొడక్ట్‌ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మేము పుష్ప పార్ట్‌-1 సాధారణ సినిమాగానే చేశాం. కానీ ప్రేక్షకలు తమ ఆదరణతో గొప్ప సినిమా చేశారు. ఈ రోజు పుష్ప-2 రూపంలో బిగ్గెస్ట్‌ ఇండియన్‌ సినిమా చేయడానికి కారణం మీ ఆదరణే, అందరూ కలిసి పుష్ప-2 విడుదలను సెలబ్రేట్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు.

Show comments