Pushpa 2 : సుకుమార్ కు ఎప్పటికి రుణపడి ఉంటా : అల్లు అర్జున్
- ముంబయిలో పుష్ప -2 ప్రెస్ మీట్
- కీలక వ్యాఖ్యలు చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
- డిసెంబరు 5న రిలీజ్ కానున్న పుష్ప -2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప-2 ది రూల్ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. తాజాగా ముంబయ్‌లో ‘పుష్ప-2’ హీరో, హీరోయిన్ నిర్మాతలు సందడి చేశారు. అక్కడ గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ” ఈ సినిమా విషయంలో నేను థాంక్స్ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు.. వాళ్లు లేకుంటే, వాళ్ల సపోర్ట్ లేకుండా ఈ సినిమా సాధ్యపడేది కాదు. నా చిన్ననాటి స్నేహితుడు దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్క్షతలు. త్వరలో రాబోతున్న పాటతో దేవి మ్యాజిక్ మరో సారి తెలుస్తుంది. ఫహాద్ ఫాజిల్‌తో పనిచేయడం ఎంతో గ్రేట్‌గా వుంది. గత నాలుగు సంవత్సరాలుగా రష్మికతో కలిసి పనిచేశాను. ఈ ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు కావాలి అనిపించేంతగా రష్మిక గొప్పతనం కనిపిస్తుంది.
Also Read : Kichcha Sudeep : క్రిస్మస్ రేస్ లో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’
Also Read
నా జర్నీలో దర్శకుడు సుకుమార్‌తో 20 ఏళ్ల ప్రయాణం మొదలైంది. పుష్ప ఈ రోజు నేను హీరోగా ఇలా వున్నానంటే ఆయనే కారణం నన్ను స్టార్‌ను చేసింది సుకమారే. నా లైఫ్‌లో అత్యధిక భాగం. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది. ఈ రోజు ఆయన రాలేదు కానీ ఈ రోజు కూడా చిన్న చిన్న మార్పుల కోసం సినిమాపై ఇంకా పనిచేస్తున్నాడు. ప్రేక్షకులకు ఓ బెస్ట్ సినిమా ఇవ్వాలి. వాళ్లకు గొప్ప ఎక్స్‌పీరియన్స్ సినిమా ఇవ్వాలని వర్క్ చేశాం. ఐదు సంవత్సరాలు మా లైఫ్‌లో బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మేము పుష్ప పార్ట్-1 సాధారణ సినిమాగానే చేశాం. కానీ ప్రేక్షకలు తమ ఆదరణతో గొప్ప సినిమా చేశారు. ఈ రోజు పుష్ప-2 రూపంలో బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా చేయడానికి కారణం మీ ఆదరణే, అందరూ కలిసి పుష్ప-2 విడుదలను సెలబ్రేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!