Hyderabad Police Release a Statement on Jani Master Arrest: జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పీఎస్ లో నమోదైన కేసును నార్సింగ్ పీఎస్ లో రీ రిజిస్టర్ చేశాం అని బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశాం అని పోలీసులు పేర్కొన్నారు. 2020 లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, అప్పుడు ఆమె మైనర్ అని పేర్కొన్నారు.
Jani Master: ఐదారేళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? జానీ మాస్టర్ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్ సంచలనం
ముంబై లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొన్న పోలీసులు మైనర్ మీద రేప్ కావడంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా పెట్టామని వెల్లడించారు. ఇక గాలింపు మొదలు పెట్టి జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. గోవా కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొస్తున్నాం అని పేర్కొన్న పోలీసులు రేపు కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు. జానీ బాషాపై పోక్సోతో పాటు రేప్ కేసులు నమోదు చేశామని పేర్కొన్న పోలీసులు ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని అన్నారు. మైనర్ గా ఉన్న సమయంలో అత్యాచారం చేసినందున పోక్సో సెక్షన్ యాడ్ చేశామని వెల్లడించారు. జానీ బాషా లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారంతో పాటు దాడికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.