Site icon NTV Telugu

Anti-Piracy: సినీ పైరసీ రాకెట్.. సినీ ప్రముఖులతో పోలీసుల అత్యవసర సమావేశం

Anti Pirachy

Anti Pirachy

హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఇటీవల వెలుగులోకి వచ్చిన అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్‌పై పరిశీలనలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్‌ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములతో కలిసి జరిగిన ఈ సమావేశంలో కేసు వివరాలు, నేరగాళ్లు అవలంబించిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చారు.

Also Read : The Raja Saab Trailer : ది రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్

అధికారులు వెల్లడించిన ప్రకారం, తాజా దర్యాప్తులో రెండు ప్రధాన మార్గాల ద్వారా సినిమాలు పైరసీ అవుతున్నాయి.
1. థియేటర్లలో రహస్య చిత్రీకరణ:
నిందితులు మొబైల్‌ ఫోన్ల సహాయంతో హాళ్లలో దొంగచాటుగా సినిమాలు రికార్డు చేస్తున్నారు.
2. డిజిటల్‌ హ్యాకింగ్: సైబర్ నేరగాళ్లు విడుదలకు ముందే డిజిటల్‌ డెలివరీ సిస్టమ్స్‌ హ్యాక్ చేసి, ఒరిజినల్‌ కంటెంట్‌ను అక్రమంగా కాపీ చేస్తున్నారు అని సీవీ ఆనంద్ తెలిపారు.

Also Read :Tragedy : జగిత్యాలలో ప్రేమకథ దారుణాంతం.. సినిమా స్టైల్లో..!

గుర్తించిన వెబ్‌సైట్లు
పోలీసుల దర్యాప్తులో TamilMV, Tail Blasters, Movierulz వంటి ప్రముఖ పైరసీ పోర్టల్స్‌ బయటపడ్డాయని, వీటికి ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ స్పాన్సర్లు ఆర్థిక లాభాలు అందిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. పైరసీ ఫైల్స్‌ తర్వాత టొరెంట్‌ సైట్లు, టెలిగ్రామ్‌ ఛానెల్స్‌, అక్రమ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్స్‌ ద్వారా విస్తృతంగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. అంతే కాదు, ఈ వెబ్‌సైట్లు సందర్శించిన వారి వ్యక్తిగత డేటాను సేకరించి, తద్వారా మోసాలు, డిజిటల్‌ అరెస్టులు వంటి సైబర్‌ నేరాలకు వాడుతున్నట్లు చెప్పారు.

చర్యలు
డిజిటల్‌ పార్ట్నర్స్: సైబర్‌ సెక్యూరిటీని బలోపేతం చేయాలి, రెగ్యులర్‌ ఆడిట్లు చేయాలి, యాక్సెస్‌ కంట్రోల్‌ కఠినంగా అమలు చేయాలి.
థియేటర్‌ యజమానులు: రికార్డింగ్‌ పరికరాల వాడకాన్ని పూర్తిగా నిరోధించాలి, సీసీ కెమెరా పర్యవేక్షణను పెంచాలి.
ప్రొడక్షన్‌ యూనిట్లు: కంటెంట్‌ కస్టడీపై కఠినమైన నియంత్రణ ఉండాలి, వాటర్‌మార్కింగ్‌, ఫోరెన్సిక్‌ పద్ధతులను అమలు చేయాలి.

ఇక ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, హీరోలు వెంకటేష్, నాగార్జున, నాని, నాగ చైతన్య, రామ్ తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారు పోలీసుల నిర్ణయానికి అభినందిస్తూ ఈ విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

Exit mobile version