NTV Telugu Site icon

Chhaava: రిలీజ్ కు ముందు వివాదం.. అయినా భారీ క్రేజ్

Chhaava

Chhaava

మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ఛావా. తొలుత హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమా తెలుగులో కూడా వస్తే బాగుండు అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈ సినిమాని తెలుగులో తీసుకువచ్చేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ సినిమా రిలీజ్ చేస్తుందంటేనే సినిమా మీద మామూలుగానే అంచనాలు ఉంటాయి. దానికి తోడు భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా కావడంతో దీన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

Venkatesh: 303 కోట్ల రీజనల్ బ్లాక్ బస్టర్..20 కథలు కాదని డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్స్?

తెలుగు రాష్ట్రాలలో దాదాపు 550 కి పైగా స్క్రీన్స్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మేడాక్ ఫిలిమ్స్ బ్యానర్ మీద దినేష్ విజన్ నిర్మించారు. విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గా రష్మిక మందన ఏశుభాయిగా నటించిన ఈ చిత్రం హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టి దాదాపు 500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని గీతా కాంపౌండ్ నమ్ముతుంది. తెలుగు ట్రైలర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి తెలుగు వెర్షన్ కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.