NTV Telugu Site icon

WAR 2 : హృతిక్ రోషన్ కు గాయం.. వార్ 2 రిలీజ్ డౌటే.?

War 2

War 2

దేవరతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ వార్ 2. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ అందించిన అయాన్ ముఖర్జీ వార్ 2 కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరిదశ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు15న వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Dragon : ప్రదీప్ రంగనాథన్‌‌ డ్రాగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కాగా వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేయాల్సిన ఓ ఎనర్జిటిక్ పాట రిహార్సల్స్ సమయంలో హృతిక్ కాలికి గాయమైంది. నొప్పి కాస్త తీవ్రం అవడంతో వైద్యులు చికిత్స అందించారు. అలాగే హృతిక్ కు కొద్దీ రోజులు విశ్రాంతి అవసరమని, కాలిపై భారం పడకూడదం సూచించారట. దాదాపు నెల రోజులు పాటు హృతిక్ రోషన్ కు బెస్ట్ రెస్ట్ అవసరమని సూచించారట వైద్యులు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి హృతిక్ చేయబోయే ఈ సాంగ్ ను మే నెలలో షూటింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు హృతిక్ గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడే ఛాన్స్ ఉంది. సో ఈ నేపధ్యంలో వార్ 2 రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని బాలీవుడ్ మీడియా సమాచారం. ఈ పాటను భారీ సెట్స్ నడుమా దాదాపు  500మంది డ్యాన్సర్లతో షూట్ చేస్తున్నాడట ఆయన్ ముఖర్జీ. బాస్కో మార్టిస్‌ దీనికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ  భారీ యాక్షన్  ఎంటర్టైనర్ ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది.