Site icon NTV Telugu

“విక్రమ్ వేద” హిందీ రీమేక్ లో హృతిక్, సైఫ్

Hrithik Roshan and Saif Ali Khan to team up for Hindi Ramek of Vikram Veda

2017లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేదా’. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు నటులు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగులో ఈ సినిమాపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ హిందీ వెర్షన్ పై మాత్రం అధికారిక ప్రకటన వచ్చేసింది.

Read Also : “బాహుబలి”కి ఆరేళ్ళు… పిక్ షేర్ చేసిన ప్రభాస్

‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన నటించనున్నారు. హృతిక్, సైఫ్ పాత్రలు ఏంటో వెల్లడించలేదు మేకర్స్. కానీ హృతిక్ విజయ్ సేతుపతి పాత్రలో, మాధవన్ పాత్రలో సైఫ్ కన్పిస్తారనే ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి. ఇటీవలి కాలంలో సైఫ్ నెగటివ్ రోల్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రభాస్ ‘ఆదిపురుష్’లో కూడా సైఫ్‌ రావణుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌ను దర్శకుల ద్వయం పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను 2022 సెప్టెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

Exit mobile version