హృతిక్ రోషన్ లాంటి ఆజానుబాహుడు హీరో… అతడితో రొమాన్స్ చేయబోయేది టాల్ అంట్ టాలెంటెడ్ దీపికా పదుకొణే! సినిమా పబ్లిసిటీకి ఇంకేం కావాలి? అందుకే, డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ సినిమా సెట్స్ మీదకి వెళ్లకుండానే చర్చగా మారింది. తాజాగా ఓ భారీ బిజినెస్ డీల్ కూడా కుదుర్చుకుని దర్శకనిర్మాత సిద్ధార్థ్ ఆనంద్ మరింతగా అంచనాలు పెంచేశాడు!
Read More: ‘ద ఫ్యామిలీ మ్యాన్ 3’లో సౌత్ స్టార్ హీరో!
‘వార్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. అయితే, తన నెక్ట్స్ సినిమాని మళ్లీ హృతిక్ తో కాంబినేషన్ లోనే చేస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. అంతే కాదు, ఈసారి నిర్మాతగా కూడా మారిన ఆయన తన ‘మార్ ఫ్లిక్స్’ బ్యానర్ పై 250 కోట్ల భారీ బడ్జెట్ తో ‘ఫైటర్’ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. కాకపోతే, ప్యాండమిక్ వల్ల డిలే అయిన హృతిక్ అండ్ దీపికా స్టారర్ ఇప్పుడు వయాకామ్ 18 సంస్థను ఆకర్షించింది. స్టూడియో పార్టనర్ గా ‘ఫైటర్’ మూవీలో జాయిన్ అయిన వయాకామ్ మొత్తానికి మొత్తంగా థియేట్రికల్, డిజిటల్, సాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసిందట. కరోనా కల్లోలం తరువాత బాలీవుడ్ లో ఇంత పెద్ద డీల్ ఇదే మొదటిది అంటున్నారు. ఖచ్చితంగా ఎంత మొత్తం ఒప్పందం కుదిరిందో మనకు తెలియదు కానీ… ‘ఫైటర్’ సినిమాకి అసలు హైలైట్ హృతిక్ అండ్ దీపిక కాంబినేషనే అంటున్నారు. వారిద్దర్నీ తెర మీద తొలిసారి చూడాలని జనం క్రేజీగా ఉండటం సహజమే కదా! పైగా ‘ఫైటర్’లో హృతిక్ మొదటిసారి ఎయిర్ ఫోర్స్ పైలట్ గా అలరించటం మరింత హైలైట్ అవ్వనుంది…