Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర రంగంలో ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్స్ తో సెన్సేషన్ చేసిన చాటిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఓవర్సీస్ రంగంలోకి అడుగుపెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది‘ ద్వారా హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ లో పెద్ది మొట్టమొదటి అంతర్జాతీయ పంపిణీ ప్రాజెక్ట్ కావడం విశేషం.
గత కొన్నేళ్లుగా రూటెడ్ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో హోంబలే ఫిల్మ్స్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రాంతీయ భాషా చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సృష్టించిన ఈ సంస్థ ఇప్పుడు నేరుగా పంపిణీ రంగంలోకి దిగడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘పెద్ది’ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తమ ముద్రను బలంగా వేయాలని హోంబలే భావిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్స్ మరియు పవర్ఫుల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ మేకోవర్, ఇంటెన్స్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్ ఇప్పటికే సెన్సేషన్ అయ్యాయి. హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ కావడం విదేశాల్లో ముఖ్యంగా యూరప్ మరియు ఆస్ట్రేలియా వంటి కీలక ప్రాంతాల్లో ‘పెద్ది’ భారీ ఎత్తున విడుదల కానుంది. అన్ని అంచనాలను మించి రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రామ్ చరణ్ క్రేజ్, హోంబలే ఫిల్మ్స్ బ్రాండ్ వాల్యూ మరియు రెహమాన్ మ్యూజిక్ వెరసి.. ‘పెద్ది’ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనిట్రేడ్ అంచనా.
Also Read
తాజావార్తలు
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!