Site icon NTV Telugu

Tollywood : హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు

Tollywood

Tollywood

తెలుగులో రిపీట్‌ సీజన్‌ నడుస్తోంది . స్టార్‌ హీరోల్లో సగం మందికిపైగా కలిసొచ్చిన డైరెక్టర్స్‌తోనే వర్క్‌ చేస్తున్నారు. ఈ రిపీట్‌ కాంబినేషన్‌ మూవీస్‌కు వస్తున్న హైప్‌ అంతా ఇంతా కాదు. మెగాస్టార్‌ కెరీర్‌లో ‘వాల్తేరు వీరయ్య’ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంతటి హిట్‌ ఇచ్చిన బాబీకి చిరు మరో ఛాన్స్‌ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన ‘డాకు మహారాజ్‌’ కూడా సక్సెస్‌ కావడంతో.. హిట్ సెంటిమెంట్‌ను మెగాస్టార్‌ కంటిన్యూ చేస్తున్నాడు.  కొత్తవాళ్లకు ఛాన్సులిచ్చి వరుస హిట్స్‌ కొట్టిన బాలయ్య మారిపోయాడు. ఈ హీరో సినిమాల లైనప్‌ చూస్తుంటే కొత్తవాళ్లకంటే హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్స్‌నే రిపీట్‌ చేస్తున్నాడు. వీరసింహారెడ్డి ఫేం గోపీచంద్‌ మలినేనికి మరో ఛాన్స్‌ ఇచ్చాడు.  తనకు బాగా కలిసొచ్చిన వెంకటేశ్‌ను అనిల్‌ రావిపూడి వదిలిపెట్టే సమస్యే లేదంటున్నాడు. ఎఫ్2..ఎఫ్3.. సంక్రాంతి వస్తున్నాం తర్వాత అనిల్‌ తీస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌’లో వెంకీకి క్యామియో రోల్‌ ఇచ్చాడు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్‌ కథను రెడీ చేస్తాడు అనిల్‌.

Also Read : Akhanda2 Thaandavam : మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్.. ఇప్పటికి ఓపెన్ కానీ నైజాం బుకింగ్స్

ఇక బన్నీ త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. రామ్‌చరణ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చేస్తున్నాడు. ఆ తర్వాత కలిసొచ్చిన సుకుమార్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సూపర్ హిట్ అయింది.  జల్సా తర్వాత పవన్‌ కొన్నేళ్లపాటు సక్సెస్‌ చూడలేదు. ఇలాంటి టైంలో వచ్చిన గబ్బర్‌సింగ్‌ పవన్‌కు అదిరిపోయే హిట్‌ ఇచ్చింది. గబ్బర్‌సింగ్‌ కాంబో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ రూపొందుతోంది. ఓజీ హిట్‌ కావడంతో సీక్వెల్‌కు డేట్స్‌ ఇస్తానని మాటిచ్చాడు. స్టార్సే కాదుయంగ్‌ హీరోలు సైతం హిట్ ఇచ్చిన డైరెక్టర్‌ని రిపీట్‌చేస్తున్నాడు. దసరా హిట్‌ తర్వాత నాని, శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్‌’ చేస్తున్నారు. టాక్సీవాలా తర్వాత విజయ్‌ దేవరకొండ కలిసొచ్చిన సంకృత్యయాన్‌తో వర్క్‌ చేస్తున్నాడు.

Exit mobile version