కార్తీ ‘HIT 4’ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందట! నాని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్..

Hit 4 Karthi Script Ready

Hit 4 Karthi Script Ready

HIT 4 Update:టాలీవుడ్‌లో క్రేజీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి రాబోతున్న ‘హిట్ 4’పై డైరెక్టర్ శైలేష్ కొలను సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే ‘హిట్ 3’ క్లైమాక్స్‌లో తమిళ స్టార్ హీరో కార్తీని ఏసీపీ వీరప్పన్‌గా పరిచయం చేసి సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చిన శైలేష్, ఇప్పుడు పార్ట్-4 కథను కూడా పూర్తిగా లాక్ చేసినట్లు ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కి, డిసెంబర్ 4న రిలీజ్ కానున్న ‘అలియాస్ రుక్మిణి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన ఈ సీక్రెట్ బయటపెట్టారు.

ఈ వేడుకలో యాంకర్ సుమ ‘హిట్ 4’ గురించి ప్రస్తావించగానే.. శైలేష్ కొలను ముందు వరుసలో కూర్చున్న నాని వైపు తిరిగి “నాని బ్రో చెప్పొచ్చా?” అంటూ సరదాగా పర్మిషన్ తీసుకున్నారు. నాని నవ్వుతూ ఓకే అనడంతో అసలు విషయం రివీల్ చేశారు. ‘హిట్ 4’ స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం పూర్తయిపోయిందని, కథ చాలా అద్భుతంగా సిద్ధమైందని ఆయన స్పష్టం చేశారు. అయితే స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ, ఇంకా నానికి కథ నెరేట్ చేయలేదని శైలేష్ తెలిపారు.

ప్రస్తుతం నాని ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ పనులతో పాటు ‘బ్లడీ రోమియో’ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారని, అందుకే ఇప్పుడే ఆయనను డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటున్నట్లు చెప్పారు. నాని కొంచెం ఫ్రీ అవ్వగానే ముందుగా ఆయనకే పూర్తి కథ వినిపిస్తానని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే నేరుగా కార్తీని కలిసి నెరేషన్ ఇస్తానని శైలేష్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ‘హిట్’ యూనివర్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్న నాని ఓకే చెప్పిన వెంటనే, కార్తీతో ‘హిట్ 4’ పట్టాలెక్కడం ఖాయమని డైరెక్టర్ మాటలతో తేలిపోయింది. శైలేష్ కొలను ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్ అప్‌డేట్‌తో అటు నాని ఫ్యాన్స్, ఇటు కార్తీ అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ ఖుషీ అవుతున్నారు.