Site icon NTV Telugu

Hit 3 : రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం లో నాని !

Ranaja Mouli Nani

Ranaja Mouli Nani

హీరో నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న ‘హిట్ 3’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మే 1న రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను సైతం వేగవంతం చేస్తున్నారు. నానికి జోడీగా హీరోయిన్ శ్రీ నిధి శెట్టి నటిస్తుండగా బ్రహ్మాజీ ,సూర్య శ్రీనివాస్ ,రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదలకు 4 రోజులు మాత్రమే ఉండటంతో దేశమంతా తిరిగి మరి సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు నాని.   ఫైనల్ గా నిన్న సినిమా కు సంబంధించిన ఫంక్షన్‌ గ్రాండ్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాజమౌళి రాగా హిట్ 1, 2 హీరోలు విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా గెస్ట్ గా వచ్చారు. ఆద్యంతం కలర్ ఫుల్‌గా జరిగిన వేడుకలో ఊహించని సర్ప్రైజ్‌లు ఇచ్చారు. ఈ సందర్భంగా మహాభారతం గురించి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది రాజమౌళి.

Also Read: Mega157 : చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా లేడి సూపర్ స్టార్..?

యాంకర్ సుమ సరదాగా నిర్వహించిన స్టేజి ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన అప్డేట్ రాబట్టింది. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంలో నాని ఉంటాడా లేదా అని అడిగిన ప్రశ్నకు ఆయన వెంటనే బదులిస్తూ ‘నాని డెఫినిట్‌గా ఉంటాడని’ చెప్పడంతో చప్పట్లతో మొత్తం ప్రోగ్రామ్ హోరెత్తించింది. ఇటీవల అమీర్ ఖాన్ తాను మహాభారతం తీయబోతున్నట్లు, స్క్రిప్ట్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇక రాజమౌళి ఈ ఆలోచనని పూర్తిగా మానుకుంటారేమోనని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని స్పష్టంగా కుండబద్దలు కొట్టేశారు జక్కన్నా.

Exit mobile version