పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’.. ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి రోజు నుంచి థియేటర్ల వద్ద అభిమానులు క్యూ కట్టడం, పవన్ కళ్యాణ్ స్వయంగా సక్సెస్ మీట్‌కి హాజరవడం సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిపింది. అయితే, పబ్లిక్ టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ టీమ్ మాత్రం సినిమా విజయంపై పూర్తి నమ్మకాన్ని చూపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 2 వస్తుందని ప్రకటించగా, దానికి ‘బ్యాటిల్ ఫీల్డ్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. కానీ తాజా సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ జ్యోతికృష్ణ, పవన్ కళ్యాణ్ లు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్ట్ 2 సినిమా ఒక్కటీ కాదు.. మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది.
Also Read : Kingdom : “నా కింగ్డమ్ ఆర్కిటెక్ట్స్” అంటూ.. సందీప్ వంగా – గౌతమ్ మధ్య విజయ్
ముందుగా పార్ట్ 1 బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాటలోకి రావాలి, నిర్మాత ఏఎం రత్నన్‌కు పెట్టుబడి నమ్మకం కలగాలి, పవన్ కళ్యాణ్ డేట్స్ అందుబాటులో ఉండాలి.. ఇవి నెరవేరితే పార్ట్ 2 మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సెకండ్ హాఫ్‌లోని కొన్ని VFX సీన్లపై విమర్శలు రావడంతో, వాటిని మెరుగుపరిచి థియేటర్లలో ట్రిమ్ చేసిన వెర్షన్ చూపించాలనే దిశగా ముందుకెళ్తున్నారు. కానీ టీం మాటలు వింటుంటే బాహుబలి, కెజిఎఫ్, పుష్ప గా పార్ట్ 2 కి హైప్ వస్తుందనే స్థాయికి మాత్రం వీరమల్లు ఇంకా చేరలేకపోయినట్టు అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ‘జాగ్రత్తగా ప్లాన్ చేస్తాం.. టైం తీసుకుంటాం.. కానీ చేయడం సాధ్యమే’ అని చెబుతున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే – వీరమల్లు పార్ట్ 2 ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశం ఉంది.. కానీ కొన్ని షరతులను దాటితే అది జరగలదు.
