Site icon NTV Telugu

Puri Jagannadh : విజయ్‌ సేతుపతి- పూరి సినిమాలో బాలయ్య హీరోయిన్..

Puri , Vijya Sedhupati

Puri , Vijya Sedhupati

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు .. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో సినిమాలు తీస్తున్న ప్రతి ఒక స్టార్ హీరోకు ఒక్కప్పుడు స్టార్ డమ్ వచ్చింది పూరి వల్ల. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, తారక్,రవితేజ.. వంటి స్టార్స్ అందరి కెరీర్ ని తన సినిమాలతో ములుపుతిప్పాడు. కానీ ప్రజంట్ ఆయని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. చివరగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్లు చవిచూసిన పూరీ ప్రజంట్ తన కొత్త సినిమాని హీరో విజయ్‌ సేతుపతి ప్రకటించాడు. అయితే ఇప్పటికే ఈ మూవీలో నటీనటుల గురించి వేట మొదలవ్వగా.. ఇటీవల ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ అండ్ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ టబు ఈ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా మరో హీరోయిన్ పేరు వినపడుతుంది.

Also Read : Prema : అతను సెట్‌లోనే చనిపోయాడు..

ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర కోసం హీరోయిన్ రాధిక ఆప్టే ని ఓకే చేశారు. ఇందులో ఆమె పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇంతకు ముందు చిత్రాలో రాధిక యాక్టింగ్ మనం చూశాం. ఎన్ని సినిమాలు తీసింది అనే విషయం పక్కన పెడితే.. సూపర్ స్టార్ రజినీకాంత్, బాలకృష్ణ, వంటి పెద్ద హీరోల చిత్రాలో నటించింది. ఇక పూరి మూవీ లోని పాత్రలన్నీ చాలా వేరియేషన్స్‌తో సాగుతాయట. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. అంతేకాదు జూన్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కాబోతుందట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Exit mobile version