Site icon NTV Telugu

Karthika Nair: కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్‌

Actress Karthika

Actress Karthika

హీరోయిన్‌ కార్తీక నాయర్‌.. తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. సీనియర్ నటి రాధ నట వారసురాలిగా జోష్‌ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగం సినిమాతో సౌత్‌లో స్టార్‌డమ్‌ అందుకుంది. ఆ తర్వాత దమ్ము, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి వంటి చిత్రాలతో అలరించింది. అయితే కార్తీక నటించిన సినిమాలు సక్సెస్‌ అయినా టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్స్‌ మాత్రం కరువయ్యాయి. దీంతో కోలివుడ్‌కు వెళ్లి అక్కడ తన లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ ఆడపదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. పెద్దగా ఆఫర్స్‌, సక్సెస్‌ లేకపోవడంతో నటనకు గుడ్‌బై చెప్పి ఫారిన్‌కు చెక్కేసింది. ఓ ప్రముఖ కంపెనీలో జాబ్‌లో సెటిల్‌ అయ్యింది. ఇక వెండితెరకు దూరమైన ఆమె గత నెల సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని తెరపైకి వచ్చింది.

Also Read: Bigg Boss 7 Telugu: మరోసారి రెచ్చిపోయిన రతిక.. రచ్చ రచ్చ చేసిన అర్జున్..

నిశ్చితార్థం చేసుకున్నట్టు స్వయంగా ప్రకటించిన కార్తీక.. సోషల్‌ మీడియాలో పలు ఫొటోలు కూడా షేర్‌ చేసింది. అయితే అందులో కాబోయే వాడి ఫేస్‌ మాత్రం రివీల్‌ చేయలేదు. దాంతో కార్తీక వరుడు ఎవరా అని అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక అందరికి శ్రమ ఇవ్వకుడదని అనుకుందేమో.. తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేసింది. ఈ మేరకు ఫొటో షేర్‌ చేసి భర్త ఫేస్‌ని రివీల్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇందులో కార్తీక తన కాబోయే భర్తతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. వీరిద్దరిని చూసి మేడ్‌ ఫర్‌ ఈజ్‌ అదర్‌ అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఫ్యాన్స్‌ నుంచి శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తున్నాయి. కాగా తన భర్త పేరు రోహిత్‌ మీనన్‌ అని చెప్పిన కార్తీక.. అతడు ఏం చేస్తాడనేది మాత్రం వెల్లడించలేదు.

Also Read: Vishwak Sen: షూటింగ్ లో విశ్వక్ సేన్ కాలికి గాయాలు?

Exit mobile version