Mukhya Gamanika: “ముఖ్య గమనిక” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్యఅతిథిగా హీరో విశ్వక్ సేన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాన్ ముత్తంశెట్టి హీరోగా లావణ్య హీరోయిన్ గా శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మరియు సాయి కృష్ణ నిర్మాతలుగా కొత్త దర్శకుడు వేణు మురళీధర్. వి దర్శకత్వంలో వస్తున్న సినిమా ముఖ్య గమనిక. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ కు భారీ స్పందన లభిస్తోంది. హీరో విశ్వక్ సేన్ ముఖ్యఅతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాని ఫిబ్రవరి 23న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ : విరాన్ నేను జిమ్ ఫ్రెండ్స్. చాలా మంచి వ్యక్తి. వెనక ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న తన సొంత కష్టం మీద పైకి రావాలనుకుంటున్నాడు. విరాన్ నన్ను అన్నా అంటాడు కానీ నేను విరాన్ని అన్నా అని పిలవాలి. ఫిబ్రవరి 23న ఈ సినిమా రిలీజ్ అవుతుంది విరాన్ కి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని టీమ్ అందరికీ కూడా పెద్ద విజయం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
Also Read:Sundaram Master: హర్షని అలా ఎప్పుడూ చూడలేదు.. ‘సుందరం మాస్టర్’ పెద్ద హిట్ అవ్వాలి
Also Read
డైరెక్టర్ వేణు మురళీధర్ మాట్లాడుతూ : ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చి మా సినిమాను సపోర్ట్ చేస్తున్న విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను అంటే కారణం అల్లు అర్జున్ గారు. విరాన్ ముత్తంశెట్టి ఈ సినిమా ఒప్పుకోవడం నా అదృష్టం. సమయాన్ని కరెక్ట్ గా పాటించే వ్యక్తి. హీరోయిన్ లావణ్య చాలా బాగా చేసింది. కిరణ్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాతో నాకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ : ఫిబ్రవరి 23న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకి నచ్చే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. లవ్ డ్రామా సస్పెన్స్ మంచి మ్యూజిక్ అన్నీ ఉన్నాయి. నాకు హీరోయిన్ గా ఇంతక మంచి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ వేణు మురళీధర్ గారికి మా ప్రొడక్షన్ టీం శివిన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు. విరాన్ చాలా మంచి వ్యక్తి మంచి సపోర్టివ్. అలాగే ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన విశ్వక్ సేన్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాని మంచి సక్సెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
Also Read:Kushitha Kallapu: నాలుగు రోజులు కష్టపడ్డా.. అయినా గుంటూరు కారంలో నన్ను లేపేశారు!
హీరో విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ : మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వేణు గారికి నా ప్రొడ్యూసర్స్ కి చాలా థ్యాంక్స్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ అన్ని చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. షూటింగ్లో బిజీ ఉండి కూడా నాకోసం వచ్చారు విశ్వక్ అన్న ఆయన కు చాలా థాంక్స్. నా వెనకే ఉండి నన్ను సపోర్ట్ చేసే అల్లు అర్జున్ గారికి నా కజిన్ శిరీష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇలా మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!