NTV Telugu Site icon

Sharwanand: ఇకపై అలాంటి పాత్రలు చేయను..!

Sharwanand

Sharwanand

శర్వానంద్ గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. రొటీన్ కు భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని, కమర్షియల్ హిట్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అదే పంథాలో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో అతను చేసిన సినిమానే ‘ఒకే ఒక జీవితం’. ఈ మూవీతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం కాగా, తెలుగు, తమిళ భాషల్లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. అక్కినేని అమల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 9న (శుక్రవారం) జనం ముందుకు వచ్చింది.

శర్వానంద్ ఈ మూవీ మీద ఎందుకు ఇంతగా హోప్స్ పెట్టుకున్నాడో అతని పాత్రను చూస్తే తెలుస్తోంది. ఆది పాత్రలో శర్వా చక్కగా ఒదిగిపోయాడు. చాలా ఓన్ చేసుకుని ఆ పాత్రను పోషించినట్టు అర్థమౌతోంది. ఆ తర్వాత స్థానం అతని స్నేహితులుగా నటించిన ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శికి దక్కుతుంది. వాళ్ళ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సినిమా స్లోగా నడుస్తోందనే భావన ప్రేక్షకులకు కలిగినప్పుడల్లా వాళ్ళు తమదైన తరహాలో వినోదాన్ని పండించి, మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చారు. అమల కూడా తల్లి పాత్రను చక్కగానే పోషించింది. తల్లీ కొడుకుల మధ్య బాండింగ్ సీన్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తాయి.

అయితే ఈ మధ్యనే ఓ ఇంటర్వూ లో.. సర్వానంద్‌ మాట్లాడుతూ.. ‘ఒకే ఒక జీవితం’తో సక్సెస్ అందుకున్న హీరో శర్వానంద్ ఇకపై పాత్రల ఎంపికలో నిక్కచ్చిగా ఉంటాడట. శరీర బరువు పెంచాల్సి వచ్చే పాత్రలు చేయనని చెప్పేశాడు. ఇకపై ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాని, పాత్రల కోసం మళ్లీ బరువు పెంచదలచుకోవట్లేదని స్పష్టం చేశాడు. ఫిట్గా కావడానికి తనకు 9 నెలల సమయం పట్టిందన్నాడు సర్వానంద్‌.
World Wrestling Championships 2022: రెండోసారి కాంస్యం నెగ్గిన వినేశ్.. తొలి భారత మహిళగా రికార్డ్