Laksh Chadalavada: ”వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు” వంటి విభిన్న కథా చిత్రాలలో నటించిన లక్ష్ చదలవాడ ప్రస్తుతం మరో డిఫరెంట్ మూవీ ‘ధీర’లో నటిస్తున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజును పురస్కరించుకుని మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోందని వారు తెలిపారు.
విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు చిత్ర ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టిన దర్శకనిర్మాతలు ఎప్పటికప్పుడు తమ చిత్రానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అప్‌డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజా పోస్టర్ లో నడిరోడ్డు మీద శత్రుమూకలను చిత్తు చిత్తు చేస్తూ పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు లక్ష్ చదలవాడ. కారు మబ్బుల్లో అర్ధరాత్రి వేళ ఈ ఫైట్ జరుగుతోందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, 2023లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని తెలిపారు మేకర్స్.
పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ఇందులో లక్ష్ చదలవాడ, నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.