Site icon NTV Telugu

Adivi Sesh : కరోనా వచ్చి ఐసొలేషన్ లో ఉన్నా.. ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు చూడలేకున్నా..

Adivi Sesh

Adivi Sesh

Hero Adivi Sesh About Bimbisara and sitaramam movie

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరో నటించిన సినిమా బింబిసార నిన్న విడులైన విషయం తెలిసిందే. అయితే .. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో పాటు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ నటించిన సీతారామం సినిమా సైతం హిట్‌ కొట్టడంతో ఆ చిత్ర యూనిట్‌ సంబరాల్లో మునిగింది. ఈ సినిమాలో హీరో సుమంత్‌ ఓ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ రెండు సినిమాలపై సినీ ప్రముఖులు ప్రశంసలతో పాటు చిత్ర యూనిట్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా అడవి శేష్‌ స్పందిస్తూ.. బింబిసార, సీతారామ బాగున్నాయంటూ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వినిపిస్తోందని, ఇండస్ట్రీకి ఇది కదా కావాల్సింది అని ఆయన అన్నారు.

 

అంతేకాకుండా.. ఈ సినిమాలు హిట్‌ కావడం సంతోషం ఉందని, కానీ.. తనకు కరోనా వచ్చిన కారణంగా ఈ సినిమాలను చూడలేకపోతున్నానన్నారు. ప్రస్తుతుం వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్‌లో ఉన్నానని, కరోనా నుంచి కోలుకున్నాక ఈ సినిమాలను ఎంజాయ్‌ చేస్తానన్నారు. ఇదిలా ఉంటే.. అడవి శేష్‌కు కరోనా సోకినట్లు తెలియడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

Exit mobile version