కొరియోగ్రాఫర్, తమిళ బిగ్ బాస్ మాజీ పోటీదారుడు శాండీ “3:33 – మూను ముప్పతి మూను” అనే హారర్ చిత్రంతో హీరోగా వెండితెర అరంగ్రేటం చేస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు నంబికై చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. హర్షవర్ధన్ సంగీతం అందిస్తుండగా… శృతి హీరోయిన్ గా నటిస్తోంది. బాంబో ట్రేస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జీవితా కిషోర్ ఈ హారర్ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా… శరవణన్, రాముడు, రేష్మా పసుపులేటి, మిమి గోపి, శృతి సెల్వం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : “ఇందువదన” హీరోయిన్ ఫస్ట్ లుక్… ఇంత బోల్డ్ గానా…!!
తాజాగా “3:33 – మూను ముప్పతి మూను” టీజర్ విడుదలైంది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రం టీజర్ ను తాజాగా విడుదల చేశారు. అందులో “3:33” టైంకు, హీరోకు ఏదో లింక్ ఉన్నట్లుగా చూపించారు. గౌతమ్ మీనన్ ను పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా చూపించారు. ఆసక్తిని పెంచేస్తోన్న ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.