NTV Telugu Site icon

MAD Square : ఫస్ట్ లుక్ – ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది..

Untitled Design (6)

Untitled Design (6)

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా మ్యాడ్. గతేడాది చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం.  కామెడీ ప్రధాన నేపథ్యంలో కాలేజీ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా   సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన మనోజ్, అశోక్, దామోదర్‌ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టడం విశేషం. శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.

Also Read : Hyderabad : జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ

తాజగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ (మ్యాడ్ 2) సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ  ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను ఈ సెప్టెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  ‘ది బాయ్స్ అర్ కమింగ్ విత్ మ్యాడ్ మాక్స్’ అనే కాప్షన్ ను జత చేశారు. ఈ సీక్వెల్‌ను నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు విడుదల చేసేందుకు శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు మ్యాడ్ 2 మేకర్స్.

Show comments