యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘రాధేశ్యామ్’ కూడా ఒకటి. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ‘రాధేశ్యామ్’పై బాగానే పడింది. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఇంతకుముందు ఇటలీలో తీసిన ‘రాధేశ్యామ్’లోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఇటలీలో రిస్ట్రిక్షన్స్ ఉండడంతో చిత్రబృందం కావాల్సిన సన్నివేశాలను రిక్రియెట్ చేయడానికి విఎఫ్ఎక్స్ పై ఆధారపడుతోంది. సదరు సన్నివేశాల చిత్రీకరణ కోసం మళ్ళీ ఇటలీకి వెళ్లేకంటే విఎఫ్ఎక్స్ బెటర్ అని మేకర్స్ భావిస్తున్నారట. అయితే సినిమాకు భారీ విఎఫ్ఎక్స్ అవసరం అవుతుంది. చాలా సమయం కూడా తీసుకుంటుంది. ఈ భారీ వర్క్ తో పాటు ఇంకా ఈ చిత్రంలోని ఒక పాట, కొన్ని రోజుల ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయాలి. పెండింగ్‌లో ఉన్న పనిని చూస్తే సినిమా 2021 దసరా 2021 కి రావడం కష్టమే అన్పిస్తోంది.