Site icon NTV Telugu

Sandeep Reddy Vanga: నా కారణంగా అతడిని ఆడిషన్స్ నుండి పంపించేశారు

Untitled Design (50)

Untitled Design (50)

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ఒక్కరు. ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో ఆయన తీసిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అవడం ఆయన కెరీర్‌నే మలుపు తిప్పేసింది. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆయన ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కించేందకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

Also Read:Samantha: నా మొదటి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకం : సమంత

ఏంటా కామెంట్స్ అంటే.. విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన మొదటి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ హిందీ లో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా కియార అద్వాని హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ  హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో నటించాడు అని చెప్పి ఓ నటుడిని.. బాలీవుడ్ లో ఓ ప్రముఖ బడా నిర్మాణ సంస్థ తమ సినిమాలో తీసుకునేందుకు నిరాకరించిదట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెలిపాడు. ‘ఓ సినిమా ఆడిషన్ కోసం వెళితే ఊహించని విధంగా వారు అతన్ని నువ్వు కబీర్ సింగ్ మూవీ లో ఉన్నావ్ కదా మేము నిన్ను తీసుకోవడం లేదు అని చెప్పి పంపేసారు’ అంటూ సందీప్ వంగ తెలిపారు. కానీ ఆ నటుడు పేరు బ్యానర్ పేరు చెప్పలేదు. ప్రజంట్ అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version