NTV Telugu Site icon

ANR 100 : తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసిన మార్గదర్శకుడు : నాగార్జున.

Untitled Design (21)

Untitled Design (21)

ఈ ఏడాది సెప్టెంబర్ 20న నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు100వ జయంతిని పురస్కరించుకుని, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఇండియన్ సినీ లెజండ్ కు నివాళులు అర్పిస్తుంది.ఈ ఫెస్టివల్‌లో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా వంటి స్మాల్ సిటీస్ సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 – 22, 2024 నుండి 10 రిస్టోర్డ్ ANR క్లాసిక్స్ ప్రదర్శించనున్నారు .

Also Read: Sekhar Kammula : మల్టీస్టారర్ సినిమాలోని పోస్టర్ కు అద్భుత స్పందన..

ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున X ఖాతాలో “ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్ సినిమాల ఫెస్టివల్ తో జరుపుకోవడం ఆనందంగా ఉంది. నాన్న గారు అన్ని రకాల పాత్రలతో ప్రజల హృదయాలో నిలిచిపోయారు. అందుకే ఆయన్ని ప్రేక్షకులు నటసామ్రాట్ అని పిలుస్తారు. దేవదాసులో నాన్నగారి నటన సినిమా అన్ని వెర్షన్లలో అత్యుత్తమమైనదిగా గుర్తించబడింది. ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు వంటి అనేక చిత్రాలు నేటికీ ఎంతగానో ఇష్టపడుతున్నారు. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గదర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుంది. ఈ పండుగ ద్వారా కేవలం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఒక ఐకాన్‌ను గుర్తుంచుకుంటారు. ప్రజలు ఆయనను మరో వందేళ్లు గుర్తుంచుకునేలా ఈ వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పండుగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం NFDC-NFAI , PVR-Inoxకి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని ట్వీట్ చేశారు.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>The Akkineni family is extremely excited that the Film Heritage Foundation is celebrating the 100th birthday of Sri Akkineni Nageswara Rao our dear father across the country. 10 of his classic films are releasing in 25 cities. He was a pioneer for the Telugu Film Industry laying… <a href=”https://t.co/uhm75rHjxm”>pic.twitter.com/uhm75rHjxm</a></p>&mdash; Nagarjuna Akkineni (@iamnagarjuna) <a href=”https://twitter.com/iamnagarjuna/status/1831983450334626004?ref_src=twsrc%5Etfw”>September 6, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>