Site icon NTV Telugu

Dhanush : నా ఫేవరెట్ హీరో ఆయనే..మల్టీస్టారర్ ఆ హీరోతో మాత్రమే చేస్తా..!

Untitled Design (5)

Untitled Design (5)

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం రాయన్. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రంగా రాయన్ రానుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. SJ సూర్య ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికి విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో విశేష స్పందన దక్కిచుకుంది.

కాగా రాయన్ తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు ధనుష్. ఇందులో భాగంగా గత రాత్రి హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు ధనుష్. ఆ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా ధనుష్ మాట్లాడుతూ ” తెలుగులో నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాల ఇష్టం, మిగిలిన హీరోల ఫ్యాన్స్ నన్ను ద్వేషించొద్దు, నేను సినిమాను ప్రేమిస్తాను” అని అన్నారు.
మరొక ప్రశ్నగా యాంకర్ మల్టీ స్టారర్ చేయాలంటే సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ లలో ఎవరితో చేస్తారు అని యాంకర్ అడగగా, అందుకు సమాధానంగా జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చారు ధనుష్.

ఈ సమాధానంతో ఆడిటోరియం మొత్తం jr,ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈలలతో హోరెత్తించారు. కాగా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న రాయన్ కు సంగీతం రెహమాన్.

 

Also Read: Tollywood : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ గా ఆ హీరోయిన్..ఎవరా భామ..?

Exit mobile version