Site icon NTV Telugu

ఆ యంగ్ హీరోతో డేటింగ్ లో కత్రినా… నిజమేనట… !

Harsh Varrdhan Kapoor confirms that Katrina Kaif and Vicky Kaushal are dating

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గతకొంతకాలంగా ఓ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజమని క్లారిటీ వచ్చేసింది. కత్రినా, విక్కీ రిలేషన్ పై అనిల్ కపూర్ తనయుడు హర్ష్ వర్ధన్ కపూర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ‘బై ఇన్విట్ ఓన్లీ సీజన్ 2’ షోలో హర్ష్ కనిపించాడు. ఈ షోలో భాగంగా హర్ష్ మాట్లాడుతూ “విక్కీ, కత్రినా కలిసి ఉన్నారు. ఇది నిజం” అని చెప్పి, ఆ వెంటనే “నేను ఈ మాట చెప్పినందుకు ఇబ్బందుల్లో పడుతున్నానా? నాకు తెలియదు” అని తెలిపాడు. ఆ వెంటనే సోషల్ మీడియాలో వారి అభిమానులు #విక్కాట్, #విక్ట్రినా అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. బీ-టౌన్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రీనా లవ్ స్టోరీ కొత్తదేం కాదు. ఇంత వరకూ ఒకటి, రెండు ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయటం, డిలీట్ చేయటం లాంటి పనులు చేశారు లవ్ బర్డ్స్. అయితే, ఎవరు ఎంతగా ట్రోలింగ్ చేసినా నోరు మెదపలేదు. త్వరలోనే వీరు తమ రిలేషన్ షిప్ అనౌన్స్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

Exit mobile version