Site icon NTV Telugu

HHVM : హరిహర వీరమల్లు నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. ఆ సీన్లు కట్ చేసిన మేకర్స్

Hhvm (4)

Hhvm (4)

మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది. థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా పవర్ స్టార్ లో ఆ  గ్రేస్. ఈజ్ అలాగే ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల పట్ల నెగిటివ్ టాక్ విపరీతంగా వస్తోంది.

Also Read : WAR 2 : ఆకాశంలో వార్ 2.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్కై రైటింగ్ తో రచ్చలేపారుగా

ముఖ్యంగా సినిమాలోని సెకండాఫ్ పై మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. ఎడిటింగ్ సరిగా లేదని అలాగే కీలకమైన సన్నివేశాలలో  VFX వర్క్ అసలు బాలేదని చాలా పేలవంగా ఉందని మేకర్స్ కనీసం వాటి మీద ద్రుష్టిపెట్టలేదని  కామెంట్స్ విపించాయి. అలాగే డబ్బింగ్ వర్క్ కూడా సరిగా లేదని ప్రీమియార్స్ చుసిన ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ కామెంట్స్ పై మేకర్స్ సమాలోచనలు చేసుకున్న ఎక్కడైతే సీజీ వర్క్ బాలేదని కామెంట్స్ వినిపించాయో ఆ సీన్స్ ను తొలగించేసారట మేకర్స్.సెకండాఫ్ ను ఎడిట్ చేసి లేటెస్ట్ వర్షన్ ను నేడు రిలీజ్ చేసారని టాక్ వినిపిస్తోంది. మరి లేటెస్ట్ వర్షన్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉండగా నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు రానున్నారు.

Exit mobile version