Site icon NTV Telugu

Chiru – Charan : హరిహర ట్రైలర్ పై చిరు – చరణ్ రియాక్షన్ ఇదే

Chiru

Chiru

అనేక బాలారిష్టాల అనంతరం ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 24వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులకు కూడా బాగా నచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ గురించి సెలబ్రిటీలు అభిప్రాయాలు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “వాట్ అన్ ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్! తర్వాత దాదాపు పవన్ కళ్యాణ్ మూవీ స్క్రీన్‌లపై తన ఫైర్ చూపించడం చాలా ఆనందంగా ఉంది. హరిహర వీరమల్లు టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Also Read:South Heros : ఇన్ స్టాలో ఆ సౌత్ హీరో టాప్.. ఏ హీరోకు ఎంతమంది ఫాలోవర్లు..?

అదే సమయంలో రామ్ చరణ్ తేజ్ కూడా ట్వీట్ చేశారు. “హరిహర వీరమల్లు ట్రైలర్ సినిమా గ్రాండ్ ఎలా ఉండబోతుందో చెప్పేసింది. పవన్ కళ్యాణ్ గారిని బిగ్ స్క్రీన్‌పై చూడటం మనందరికీ ట్రీట్ లాంటిది. బ్లాక్‌బస్టర్ సక్సెస్ కోసం టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్” అని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో మొదలైంది, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయ్యింది. ఏం రత్నం నిర్మాతగా వ్యవహరించగా, కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసింది.

Exit mobile version