Site icon NTV Telugu

Harihara Veeramallu: బరిలోకి దిగిన పవన్ కల్యాణ్..!

Harihara Viramalu

Harihara Viramalu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజంట్ ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటునే.. ఒప్పుకున్న సినిమాలను ఒక్కోక్కటిగా ఫిన్నిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా అంటే ‘హరిహర వీరమల్లు’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఐదేళ్లు దాటింది. ప్రకటించిన కొన్ని నెలలకే షూట్ కూడా మొదలుపెట్టారు. కానీ రెండు భాగాలుగా అనుకున్న ఈ చిత్రంలో పార్ట్-1 కూడా పూర్తి కాలేదు. పలుమార్లు షూటింగ్‌కు బ్రేక్ పడుతూనే.. మధ్యలో దర్శకుడు కూడా మారారు. దీంతో ఇప్పుడంతలో ఈ సినిమా రిలీజ్ కాదని పవన్ అభిమానుల్లో నిరాశ మొదలైంది. కానీ  తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది..

Also Read : The Raja Saab : ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలని కోరుకుంటా..

సమాచారం ప్రకారం  ‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ కాల్ షీట్స్ కేటాయించాడట. మేలో ఇంకొన్ని రోజుల్లోనే పవన్ షూట్‌కు హాజరు కానున్నాడట. ఆయనో పది రోజులు వరుసగా చిత్రీకరణకు వస్తే బ్యాలెన్స్ షూట్ అంతా అయిపోతుంది. మాట అయితే ఇచ్చాడు కానీ పవన్ వచ్చే వరకు ఏదీ గ్యారెంటీ లేదు కాబట్టి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడం లాంటిదేమీ చేయట్లేదు చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాబీ డియోల్, నోరా ఫతేహి ఇతర ముఖ్య పాత్రపోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version