ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా,బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read : Puri Jagannadh : పూరి కి ఛార్మి కష్టాలు
అయితే ఈ మూవీ ఎప్పుడో మొదలైనప్పటికి కరోనా మహమ్మారి, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యమైంది. కానీ ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ఎ.ఎం. జ్యోతి కృష్ణ, ఎక్కడా రాజీ పడకుండా వేగంగా సినిమాని పూర్తి చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ వంటి సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం విడుదలపై ఇప్పటికే చాలా వార్తలు వినపడగా తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతుంది.
ముందుగా ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇంకా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నందున విడుదలను వాయిదా వేశారు. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ‘హరి హర వీరమల్లు’ చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. కొత్త పోస్టర్ విడుదల చేసి డేట్ కన్ఫర్మ్ చేశారు మూవీ టీం. ఇక ఏ మాత్రం టాక్ బాగున్న ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు