పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. వాస్తవానికి ఆ రోజు రిలీజ్ అయిన ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదని, సెకండ్ హాఫ్ విషయంలోనే కంప్లైంట్స్ ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే వీఎఫ్‌ఎక్స్ అయితే చాలా నాసిరకంగా ఉందని నెగెటివిటీ బాగా ఎక్కువైంది.
Also Read:HHVM: ఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు ప్రదర్శన!
తాజాగా ఎన్టీవీ ప్రత్యేకంగా జ్యోతి కృష్ణతో సంభాషించింది. ఈ సందర్భంగా జ్యోతి కృష్ణ వీఎఫ్‌ఎక్స్ గురించి నెగెటివిటీ గురించి స్పందించారు. నిజానికి ఈ సినిమాలో 4400 సీజీ షాట్స్ ఉన్నాయని, అదే హిందీ బ్రహ్మాస్త్ర సినిమాలో 4500 ఉన్నాయని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్ చేయించాలంటే రెండు మూడు ఏళ్లు పడుతుంది, కానీ నేను 10 నెలల్లోనే అవుట్‌పుట్ తీసుకొచ్చాను. బహుశా అందువల్ల కాస్త క్వాలిటీ తగ్గి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక సినిమా కథ బాలేదని, కథనం బాలేదని ఎవరూ అనడం లేదు.
Also Read:Kingdom : కింగ్ డమ్ ట్రైలర్ వచ్చేసింది..
సినిమా అన్నాక నాలుగు ప్లస్ పాయింట్లు, నాలుగు మైనస్ పాయింట్లు చెప్పాలి కాబట్టి వీఎఫ్‌ఎక్స్ బాలేదని అంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక తాను ఎక్కువగా లోకల్ కంపెనీలతోనే వీఎఫ్‌ఎక్స్ చేయించానని, పేరు ఉన్న కంపెనీలు అయితే టైం ప్రకారం పని చేస్తారు, వాళ్లు ఎక్కువ డెడ్‌లైన్ తీసుకుంటారు, కానీ లోకల్ వాళ్లు అలా కాదు, రోజుకు 15 గంటలు పని చేసి మనకి త్వరగా అవుట్‌పుట్ ఇవ్వడానికి సహాయపడతారు కాబట్టి ఆ పనికి చెన్నైలోని ఒక కంపెనీతో చేయించినట్లు ఆయన వెల్లడించారు. ఆ కంపెనీ గతంలో పొన్నియిన్ సెల్వన్ సినిమాకి వీఎఫ్‌ఎక్స్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద చాలా రోజుల నుంచి ఈ విషయం మీద చర్చ జరుగుతుండగా, జ్యోతి కృష్ణ ఇప్పుడు స్పందించడం గమనార్హం.
