హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని క్రిష్ డైరెక్షన్‌లో మొదలుపెట్టారు. అయితే సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆయన తప్పుకోవడంతో, ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. అయితే సినిమా కథ విషయంలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయని ప్రచారం నేపథ్యంలో ఆయన స్పందించారు.
Also Read : Jyothi Krishna: వీఎఫ్ఎక్స్ నెగిటివిటీ.. జ్యోతి కృష్ణ షాకింగ్ కామెంట్స్
ముందుగా కథ రాసుకున్నప్పుడు కేవలం కోహినూర్ డైమండ్ వెనక్కి తీసుకురావడమే లక్ష్యంగా రాసుకున్నాడని, అయితే ఆయన తప్పుకున్న తర్వాత కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు వేరే ఆలోచన వచ్చింది. పవన్ కళ్యాణ్ చేసిన చౌకీదార్ ఫైట్ చూసిన తర్వాత, కోహినూర్ ఒక్క దాని గురించే కాదు, ధర్మం గురించి కూడా కథలో ఏమైనా రాసుకుంటే బాగుంటుందనిపించింది. ఆ విషయం పవన్ కళ్యాణ్‌కి చెప్పితే ఆయనకు కూడా బాగా నచ్చింది.
Also Read : Kingdom : కింగ్ డమ్ ట్రైలర్ వచ్చేసింది..
దీంతో అప్పుడు కేవలం ఒక్క కోహినూర్ కోసం కాదు, ఒక్కొక్కరు ఒక్కో కోహినూర్‌గా భావించే ఐదుగురు గురువుల కోసం ప్రయాణం చేస్తున్నట్లు చూపించాను. నిజానికి క్రిష్ రాసుకున్న కథ ఎంటర్టైన్మెంట్ యాంగిల్‌లో నడుస్తుంది. అది బాగానే ఉంది, కానీ నాకు ఈ సనాతన ధర్మం ఎపిసోడ్ బాగా ఎక్కింది. అందుకే అలా రాసుకున్నాను. నేను రాసుకున్న ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలుపెట్టారంటూ జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు.
