మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు నేడు. నేటితో వారి వివాహ బంధానికి 9 ఏళ్ళు. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు సోషల్ మీడియాలో “#9YearsForRamCharanUpasana” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ వారికి మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉపాసన కూడా ఓ లవ్లీ పిక్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. రామ్ చరణ్, ఉపాసన స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ పిక్ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ 2012 జూన్ 14న ఉపాసనను వివాహమాడారు. ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ హెల్త్ టిప్స్ ను, చరణ్ కు సంబంధించిన విశేషాలను పంచుకుంటుంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది.
పెళ్లి రోజు… లవ్లీ పిక్ తో ఉపాసన పోస్ట్…!
Show comments