Site icon NTV Telugu

Hansika : OTT లో విడుదలైన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ‘గార్డియన్’

Hansika

Hansika

ఇటీవల టాలీవుడ్‌లో అత్యంత పిన్న వయస్సులోనే కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్ హీరోయిన్స్ అంటే శ్రీలీల అలాగే కృతి శెట్టి. ఈ ఇద్దరు బ్యూటీలు ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు మనకు తెలిసిందే. కేవలం 17వ ఏటకే సినీ రంగ ప్రవేశం చేసి తెలుగు ఆడియెన్స్ మెయిన్‌గా యువత హృదయాలు కొల్లగొట్టారు. కానీ వాళ్ళ కంటే చిన్న వయస్సులోనే తన వయసుకి మించిన రోల్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది హన్సిక మోత్వానీ అని చెప్పాలి. ‘దేశముదురు’ సినిమాతో అప్పట్లో సంచలనం రేపిన హన్సిక, తను ఈ సినిమా చేసిన నాటికి తన వయస్సు కేవలం అంటే కేవలం పదిహేనేళ్ళు మాత్రమే.

Also Read: Mukku Raju Master : ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషన్ లేదు..

అలా పదిహేనేళ్లకే కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక అక్కడ నుంచి హిందీ కంటే ఎక్కువ తెలుగు సహా తమిళ సినిమాలు చేస్తూ సౌత్ లోనే బిజీగా మారింది. ఇలా కొన్నేళ్లపాటు తన హవా చూపించింది కానీ నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవ్వడం కూడా మొదలైంది. ఇక హీరోయిన్స్ కెరీర్ లో మాములే. అయినప్పటికి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా వరుస షోలు, అలాగే ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇందులో భాగంగా హన్సిక హీరోయిన్ గా సబరి, గురు సరవణన్ దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ ‘గార్డియన్’ మూవీ అందరూ చూసే ఉంటారు. 2024 మార్చి 8న తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం ఉలిక్కిపడే కథనంతో, కట్టిపడేసే విజువల్స్‌తో, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.కాగా ఇప్పుడీ చిత్రాన్ని భవాని మీడియా ద్వారా ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. కథ ప్రకారం ఒక ఆత్మ రివెంజ్ తీర్చుకోవడానికి తిరిగొచ్చి హన్సిక శరీరంలోకి వెళ్లి ఏం చేసింది, ఎవరిని భయపెట్టింది అనేది స్టోరీ.

Exit mobile version